

వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌పై ఓ వెబ్ సిరీస్ తీశారు అదే 'ఫార్మా'. ఈ సిరీస్‌లో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతడు 'ప్రేమమ్' హీరోగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి ఆసక్తిని రేపుతోంది.
ఈ సిరీస్‌లో శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పి.ఏ. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ట్రైలర్ ప్రకారం — ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు. మొదట్లో సేల్స్ టార్గెట్లు సాధించలేక అవమానాలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత కష్టపడి ‘కైడోక్సిన్’ అనే ఔషధాన్ని సేల్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఆ మందు వల్ల జరిగే ప్రమాదాన్ని గ్రహించిన వినోద్, తన కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. తర్వాత ఏమవుతుందనేదే కథలో ఆసక్తికరమైన భాగం. వైద్య రంగం నేపథ్యంలోని డ్రామాలు ఇష్టపడేవారికి ‘ఫార్మా’ మంచి ఎంపికగా ఉంటుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!