

యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్ ఇప్పుడు ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదలైంది. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో కనిపించారు.
ట్రయాంగిల్ ప్రేమకథలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా, ‘పతంగ్’ ను దర్శకుడు చూపించిన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. జనవరి 30 న సన్ నెక్స్ట్ (SUN NXT)లో విడుదలైన ఈ చిత్రం, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime) మరియు ఆహా(Aha)లో కూడా అందుబాటులో ఉంది.
కథ ఏంటి?
హైదరాబాద్‌లోని ఓ బస్తీలో నివసించే విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే ధనిక యువకుడు అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. రోజూ కలుసుకోకుండా ఉండలేని స్థాయి స్నేహం వీరిది. వారి జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఏ విషయమైనా తక్షణ నిర్ణయం తీసుకోలేని స్వభావం ఉన్న ఐశ్వర్య మొదట విస్కీని ప్రేమిస్తుంది. తర్వాత అరుణ్ పట్ల కూడా ఆకర్షితురాలవుతుంది. దీంతో ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు వస్తాయి. ఐశ్వర్య కోసం వీరిద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. చివరకు ఎవరు గెలిచారు? ఐశ్వర్య ఎవరిని ఎంచుకుంది? అనేదే కథ మిగతా భాగం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!