

మలయాళ సినీ పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకున్న ‘భరతనాట్యం 2: మోహినియాట్టం’ ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. కృష్ణదాస్ మురళీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్లో పంజయ్ కురుప్, సూరజ్ వెంజరామూడు, జగదీష్ కీలక పాత్రల్లో నటించారు. సుమారు 6 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. మే 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రీజనల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. వ్యంగ్య హాస్యం, థ్రిల్లింగ్ కథనం, సహజమైన తెలుగు డబ్బింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వీకెండ్లో ఈ సినిమా వ్యూయర్షిప్ అమాంతం పెరిగినట్టు సమాచారం. మంచి కథకు భాష అడ్డుకాదని మరోసారి ‘భరతనాట్యం 2: మోహినియాట్టం’ నిరూపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!