

నెట్‌ఫ్లిక్స్ తన మోస్ట్ అవేటెడ్ సూపర్ హీరో కామెడీ కే-డ్రామా The WONDERfools ను ఈ వారం విడుదల చేయనుంది. చా ఉన్-వూ, పార్క్ ఉన్-బిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీతో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ డ్రామా కే-డ్రామా అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని భావిస్తున్నారు. ఈ షో భారతీయ ప్రేక్షకుల కోసం మధ్యాహ్నం 1:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అనుకోకుండా సూపర్ పవర్స్ పొందిన కొందరి జీవితాల చుట్టూ కథ తిరుగుతుంది. సాధారణ సూపర్ హీరో కథలతో పోలిస్తే ఈ సిరీస్‌లో ఎమోషన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను తెలుగు, హిందీ డబ్బింగ్‌లలో కూడా విడుదల చేస్తోంది. చా ఉన్-వూ, పార్క్ ఉన్-బిన్ కెమిస్ట్రీపై సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ చర్చ జరుగుతుండగా, ఈ సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి వెళ్లే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!