

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన Cమంతం చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సుధాకర్ పాణి దర్శకత్వం వహించారు. గత ఏడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, పెద్దగా గుర్తింపు పొందకపోయినా ఇప్పుడు ఓటీటీలో కొత్త అవకాశాన్ని పొందుతోంది.
కథ విషయానికి వస్తే, నగరంలో గర్భిణి మహిళలపై వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటి? అసలు హంతకుడు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో కేసును స్వీకరిస్తాడు. ఈ కేసులో బయటపడే మిస్టరీ, ఫ్లాష్‌బ్యాక్ అంశాలు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!