

కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాలలో ఐదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయగా, ఒకరికి అదనపు బాధ్యతలు ఇచ్చి, ముగ్గురిని కొత్తగా నియమించారు.
1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించిన శివప్రతాప్ శుక్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే ఏబీవీపీ సంస్థలో పనిచేసి 1983లో బీజేపీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత పలుమార్లు విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లో వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం 2017లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2023లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.









.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!