

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట్ మరోసారి సంచలనాన్ని సృష్టించింది. తాజాగా జరిగిన ప్రభుత్వ భూసేకరణ వేలంలో ఒక్క ఎకరానికి రూ.137 కోట్లు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారులు కూడా ఊహించని స్థాయిలో స్పందన రావడం విశేషం.
ఒకప్పుడు నగరానికి అంచున ఉన్న ప్రాంతంగా భావించిన కోకాపేట్, ఇప్పుడు అభివృద్ధి వేగం, రాబోయే కమర్షియల్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల పెరుగుదలతో హాట్‌స్పాట్‌గా మారింది. ప్రభుత్వం ఎకరానికి రూ.99 కోట్లు బేస్ ప్రైస్‌గా నిర్ణయించినప్పటికీ, పోటీ పడ్డ బిడ్డర్ల కారణంగా ధర భారీగా పెరిగింది.
ఇంతకుముందు రాయదుర్గం ఒక్క ఎకరానికి రూ.177 కోట్ల వరకు ధర చేరి టాప్‌లో నిలిచింది. అయితే కోకాపేట్ తాజా రికార్డు, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలకు మించి ఇతర లొకేషన్ల పై కూడా డిమాండ్ పెరుగుతోందని సూచిస్తోంది.
రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం, భవిష్యత్తులో రానున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్ జోన్లు, అలాగే ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ వంటి భారీ ప్రణాళికలు పెట్టుబడిదారులను కోకాపేట్ వైపు ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో,కోకాపేట్ వంటి ప్రాంతాలు ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ హబ్‌లుగా మారుతున్నాయి.









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!