
జనరల్

సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంత సులభం కాదని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ అన్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికి మరింత సహకారం అందించాలని ఆమె కోరారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. టాలీవుడ్లో తనకు మరో అవకాశాన్ని ఇచ్చి రీ-లాంచ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
‘సరస్వతి’ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని వరలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పెరగాలని, పరస్పర గౌరవం, సహకారం ఉంటేనే పరిశ్రమ మరింత ముందుకు వెళ్తుందని ఆమె అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!