
క్రీడలు

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తూ, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. వరుసగా క్రేజీ సినిమాలు ప్రకటించడంతో అభిమానులు ఆనందంలో ఉన్నప్పటికీ, ‘దేవర పార్ట్ 2’పై అనిశ్చితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘దేవర’ తొలి భాగం పలు భాషల్లో విడుదలై మంచి వసూళ్లు సాధించింది.
సీక్వెల్ ఉండకపోవచ్చనే వార్తలకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ స్వయంగా ‘దేవర పార్ట్ 2’ ఖచ్చితంగా వస్తుందని ప్రకటించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో మరో ప్రాజెక్ట్‌కు కమిట్ కావడంతో ఆలస్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!