
ఆరోగ్యం

సిద్ధార్థ్ మరియు శామిలి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓయ్’ సినిమా 2009లో విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. అయితే కాలక్రమేణా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇటీవల రీ-రిలీజ్లో మంచి స్పందన రావడంతో, ఈ సినిమాను జూలై 18న మరోసారి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆనంద్ రంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, డి.వి.వి దానయ్య నిర్మించారు. ఈసారి కూడా సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!