

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ హక్కుల అంశం ఇండస్ట్రీలో ప్రధాన చర్చగా మారింది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తాన్ని ఒకే సినిమాపై పెట్టుబడిగా పెట్టాలా అనే అంశంపై ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో చర్చలు కొనసాగుతున్నాయని, ఒక ప్రముఖ నిర్మాత మధ్యవర్తిత్వం వహిస్తున్నారని సమాచారం. చివరకు ఈ భారీ చిత్ర డిజిటల్ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!