
రాజకీయాలు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘ఓజీ 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుజీత్ ఇప్పటికే కథ, స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడంతో పాటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండనున్న నేపథ్యంలో ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు తగ్గినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం వచ్చే వేసవి తర్వాత ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోగా దర్శకుడు సుజీత్ నాని హీరోగా తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఓజీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. పవన్ కళ్యాణ్ ఇతర ప్రాజెక్టులపై కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!