

భారతదేశపు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన రాబోయే గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా SSMB29 కోసం అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నారు. నవంబర్ 15 న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ఈవెంట్ ముందు భాగంగా రాజమౌళి టీం అద్భుతమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మొదటగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత, ఇప్పుడు మంధాకినిగా ప్రియాంకా చోప్రా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పసుపు రంగు చీరలో గన్ పట్టుకొని కనిపించిన ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
జంగిల్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎస్కేపేడ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జాయిన్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. పృథ్వీరాజ్ ఫ్యూచరిస్టిక్ లుక్ తర్వాత ప్రియాంకా డెసీ లుక్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు లుక్ ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ అభిమానుల్లో తారస్థాయికి చేరింది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!