హీరో విశాల్, దర్శకుడు సుందర్ సి కాంబినేషన్లో మరోసారి మొగుడు సినిమా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన ఆంబళ, మద గజ రాజా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ జంట హ్యాట్రిక్ హిట్ లక్ష్యంగా ‘మొగుడు’ చిత్రాన్ని తీసుకొస్తోంది. ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్గా నటిస్తోంది. అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నవదీప్, సంపత్ రాజ్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన మొగుడు టైటిల్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఇంట్లో సాధారణ మొగుడిలా కనిపించే విశాల్, అసలు విషయంలో అండర్‌కవర్ పోలీస్‌గా రౌడీలను ఎదుర్కొంటూ కనిపిస్తాడు. దీంతో ఈ చిత్రం పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇప్పటి వరకు 40కి పైగా మాస్ సినిమాలు తెరకెక్కించిన సుందర్ సి, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్‌ను కోల్‌కతా, గోవా, చెన్నై నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని హిప్హాప్ తమిళ అందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!