
క్రీడలు

తమిళ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ గురించి విడాకుల వార్తలు వస్తున్న సమయంలో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన ఒక పెళ్లి విందుకు ఆయన నటి త్రిషతో కలిసి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే కారులో కార్యక్రమానికి చేరుకున్నట్లు వీడియోలో కనిపించడంతో అభిమానులు, సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
ఆ వీడియోలో విజయ్ పట్టు చొక్కా, పంచె ధరించి కనిపించగా త్రిష కూడా అందమైన చీరలో కనిపించారు. ఇదిలా ఉండగా తన భర్తకు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య విడాకుల పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆ నటి త్రిషేనని తమిళ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ మాత్రం లేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!