

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో ప్రారంభమైంది. అంతకుముందు మైసూరులో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్ర బృందం, ఇప్పుడు ఊటీలో షూటింగ్‌ను కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వీడియో ద్వారా పంచుకుంటూ, తన బృందంతో కలిసి అందమైన ఊటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆర్మీ యూనిఫామ్, కళ్లజోడు, మెడలో స్కార్ఫ్‌తో ఆయన కనిపించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలి వినోదం, వెంకటేష్ ప్రత్యేక పాత్ర, కళ్యాణ్ రామ్ ఎనర్జీ కలగలిసి ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!