

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ నుంచి గ్లింప్స్‌ను ఈరోజు గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను అబ్బురపరిచే విజువల్స్‌తో ఆశ్చర్యపరిచింది.
వీడియో 512 CEలో వారణాసి నుంచి మొదలై, 2027 CEలో భూమిపై పడే శంభవి ఆస్టరాయిడ్ ఘటనకు దూసుకెళ్తుంది. అక్కడి నుంచి అంటార్కటికా, ఆఫ్రికా, వనాంచల్ మీదుగా ప్రయాణించి చివరకు త్రేతాయుగం (7200 BCE) చేరుతుంది. ఇదే సమయంలో మహేష్ బాబు పోషించిన ‘రుద్ర’ ప్రవేశం భీకరంగా కనిపిస్తుంది.
గ్లింప్స్ చివర్లో మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని, నంది పై తాండవం చేస్తున్న దృశ్యం అభిమానుల్లో విపరీత ఉత్సాహాన్ని రేకెత్తించింది. మిథాలజీ, టైమ్ ట్రావెల్ రెండింటిని కలిసి రాజమౌళి ఈసారి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకురాబోతున్నట్లు కనిపిస్తోంది.
రుద్ర పాత్ర పోషించడం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేష్ బాబు భావోద్వేగంగా తెలిపారు. ఈ గ్లింప్స్‌ను రూపొందించడానికి టీమ్ దాదాపు ఒక సంవత్సరం పనిచేసిందని సమాచారం. ఇది సినిమాలో ఉండే భారీతనం, విజువల్స్‌కు సూచనగా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ నిర్మిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!