
ఓటీటీ

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’, ‘కొండ పొలం’, ‘ఆదికేశవ’ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకుని, మంచి కథ కోసం వెతుకులాట ప్రారంభించి గత కొన్ని సంవత్సరాల్లో 100కు పైగా కథలు విన్నట్లు సమాచారం.
చివరికి దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథ నచ్చడంతో తన తదుపరి ప్రాజెక్ట్ను వైష్ణవ్ తేజ్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా త్వరలో అధికారిక ప్రకటన రానుంది. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!