
బిజినెస్

గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో చోటు దక్కించుకుంది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ సినిమా పోటీ పడనుంది, అంతర్జాతీయంగా భారత సినిమాకు మరో గౌరవమైన మైలురాయి.
నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో కనిపించగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఈ సినిమాలో చక్కగా చూపించారు. 2025 మే 1 న విడుదలైన ఈ ఫీల్-గుడ్ ఎంటర్టైనర్ 90 కోట్లు పైగా కలెక్షన్లు సాధించి, OTT ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రికార్డులు కొల్లగొట్టింది. స్టార్ హీరోలు, దర్శకులు కూడా దర్శకుని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్లు చిత్ర బృందం తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!