

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు–రాజకీయాలు రెండింటిలోనూ బిజీగానే కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తూనే హరి హర వీరమల్లు ,ఓజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అందులో “ఓజీ” బ్లాక్‌బస్టర్ అయ్యి, పవన్ లుక్స్–యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇలాంటి సమయంలో నటి ఫరియా అబ్దుల్లా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. జాతిరత్నాలు చిత్రం ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఆమె, ఒక ఇంటర్వ్యూలో సుమ అడిగిన ప్రశ్నకు సంచలన సమాధానం ఇచ్చింది- “ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా- ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటా” అని చెప్పింది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తుండగా, పవన్–ప్రభాస్ అభిమానులు వేర్వేరు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఫరియా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!