
సినిమాలు

హాలీవుడ్ భారీ సర్వైవల్ థ్రిల్లర్ 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఆస్కార్ విజేత అన్నే హాతవే, ప్రముఖ నటుడు ఇవాన్ మెక్‌గ్రెగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డేవిడ్ రాబర్ట్ మిచెల్ కథ, దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత జే.జే. అబ్రామ్స్ నిర్మాణ సహకారం అందించారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇటీవల విడుదలైన పోస్టర్‌లో భారీ డైనోసార్ ఇళ్లను ధ్వంసం చేస్తూ ప్రధాన పాత్రలను వెంటాడుతున్న దృశ్యాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. యాక్షన్, అడ్వెంచర్, సర్వైవల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించనుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుండటంతో భారతీయ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!