

నటి అభిరామి తాజా చిత్రం "బ్లాస్ట్" ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో ఆమె పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఫిట్నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు యాక్షన్ ప్రధాన పాత్రలో నటించడం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, వెన్నెముక గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాల్సి వచ్చిందని అభిరామి వెల్లడించారు.
న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ట్రైనర్ సహకారంతో ఈ మార్పును సాధించానని ఆమె తెలిపారు. అలాగే ప్రస్తుతం సినీ పరిశ్రమలో వయసుతో సంబంధం లేకుండా నటీమణులకు అర్థవంతమైన పాత్రలు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నటుడు అర్జున్ సర్జా, నటి ప్రీతి ముఖుందన్, దర్శకుడు సుభాష్ కె. రాజ్‌లను అభిరామి ప్రశంసించారు. మరోవైపు, డబ్బింగ్ రంగంపై కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, డబ్బింగ్ కూడా ఒక విలువైన కళ అని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!