

రవీనా టండన్ కూతురు రాషా తడాని, హిందీ సినీ పరిశ్రమలో వైరల్ అయిన ఉయి అమ్మా పాటతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.
ఆమెకు జోడీగా జయకృష్ణ ఘట్టమనేని నటించబోతున్నారు. ఆయన సూపర్‌స్టార్ కృష్ణ గారి మనవడు, మహేశ్ బాబు గారి అన్నయ్య కుమారుడు. ఈ సినిమాతో ఆయన కూడా హీరోగా పరిచయం అవుతున్నారు.
ఇద్దరూ భారతీయ సినీ కుటుంబాల్లో అత్యంత ప్రముఖమైన వారసత్వాలు కలిగి ఉండటం వల్ల, ఈ కొత్త జంటపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.
దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ చిత్రం, తిరుపతి నేపథ్యంలో సాగే తీవ్రమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. ఇటీవలే సినిమా అధికారికంగా ప్రకటించబడింది, రాషా హీరోయిన్గా సైన్ చేసింది.
ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పీ. కిరణ్ నిర్మించగా, అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!