
సినిమాలు

సినీ నటి, హీరో అక్కినేని నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ తన కెరీర్‌తో పాటు వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వివాహం తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, వృత్తి పరంగా కూడా ఆమె తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌కు చెందిన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్న తెలుగు మహిళలను అభినందిస్తూ ఒక ప్రత్యేక వీడియో రూపొందించారు.
ఆ అభినందనకు స్పందించిన శోభిత, జీవితంలో ప్రతి పని మనసు చెప్పిన దారిలోనే ఉండాలని తన జీవన సూత్రాన్ని పంచుకున్నారు. నిజాయతీగా ఉండటం, స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడం వల్లే ప్రతి క్షణం అర్థవంతమవుతుందని ఆమె తెలిపారు. పరస్పరం ప్రోత్సహించుకోవడం ద్వారానే మహిళలు సమాజంలో మరింత ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!