

‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్న నటి, గాయని స్నిగ్ధ నయని తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలతో చర్చనీయాంశంగా మారారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, సింగింగ్ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల మరో అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకున్నట్లు చూపించే వీడియోను, హనీమూన్‌కు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె నిజంగానే వివాహం చేసుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు దీనిపై చర్చించుకున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నిగ్ధ ఈ వార్తలపై స్పందించారు. సరదాగా రీల్స్ కోసం మాత్రమే ఆ వీడియోను రూపొందించానని, అది నిజమైన పెళ్లి కాదని స్పష్టం చేశారు. తన బంధువులు కూడా ఆ వీడియోను నిజమని నమ్మి ఫోన్లు చేసి, తమకు చెప్పకుండా రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించారని తెలిపారు. తన భవిష్యత్తు పెళ్లి గురించి మాట్లాడుతూ, మనసుకు నచ్చిన సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పారు. జెండర్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన వ్యక్తి అమ్మాయైనా పెళ్లికి సిద్ధమేనని వెల్లడించారు. తగిన తోడు దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండేందుకు కూడా సిద్ధమని స్నిగ్ధ తెలిపారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!