
సినిమాలు

ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు శర్వానంద్, వచ్చే సంక్రాంతి కోసం మరో సినిమాతో సిద్ధమవుతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శ్రీను వైట్ల శైలిలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం హాస్యం, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!