

సాయి పల్లవి… తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి, ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. రామాయణం సినిమాలో సీత పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా రణబీర్ కపూర్ కనిపించనుండగా, షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా కష్టపడుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, తాజాగా ఆమె మరో ఐకానిక్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన గాయనిగా పేరొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మీ పాత్రను సాయి పల్లవి పోషించే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిజమైతే, ఇది సాయి పల్లవి కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!