
బిజినెస్

నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. విభిన్న కథలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ సంస్థ, ‘దండోరా’తో గుర్తింపు పొందిన మురళీకాంత్ దేవసోత్కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఎంపిక దాదాపు ఖరారైందని ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హీరో ఎవరు అనే విషయం మాత్రం గోప్యంగా ఉంచడంతో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త హీరోనా? లేక ఇప్పటికే గుర్తింపు పొందిన నటుడా? అనే చర్చలు కొనసాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తైతే ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!