

మ్యాచో స్టార్ గోపీచంద్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి ప్రతిష్ఠాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా ‘భరత వర్ష’లో నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందిస్తుండగా, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, దాని విస్తృతమైన నిర్మాణ విలువలు మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. వర్షంలో తడిసిన యుద్ధభూమి మధ్య విల్లు, బాణాలతో నిలబడి ఉన్న గోపీచంద్ వీరయోధుడి అవతారంలో ఆకట్టుకుంటున్నారు. మంటలు, యుద్ధ పతాకాలు, యోధుల నీడలతో కూడిన నేపథ్యం చిత్రానికి మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. క్రీ.శ. 642 కాలం నాటి భారత చరిత్రలో మరుగునపడిన ఒక అధ్యాయాన్ని ఈ చిత్రం తెరపై ఆవిష్కరించనుంది. ఈ పాత్ర కోసం గోపీచంద్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!