
రాజకీయాలు

నటి రేణు దేశాయ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీగా మారుతున్నారు. కొంతకాలం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు సినిమాలు, కమర్షియల్ యాడ్స్‌తో పాటు మూగజీవాల సంరక్షణ కోసం తన ఎన్జీవో ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జంతువుల హక్కుల కోసం కూడా నిరంతరం పోరాడుతున్నారు.
తాజాగా రేణు దేశాయ్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టిను కలిశారు. ఆ క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ, మమ్ముట్టిని కలవడం తన జీవితంలో లైఫ్‌టైమ్ డ్రీమ్ నెరవేరినట్టేనని పేర్కొన్నారు. ఆయనతో కొంత సమయం గడపడం ఎంతో ఆనందాన్నిచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. మమ్ముట్టి ఎంతో ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!