

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట తమ స్వగ్రామంలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రష్మిక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని స్వయంగా ఆహ్వానించారు.
సీఎం కుటుంబ సభ్యులతో రష్మిక ఆత్మీయంగా ముచ్చటించి, ఈ నెల 4 న తుమ్మన్‌పేట ఫామ్‌హౌస్‌లో జరిగే రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వ్రతానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి తెలంగాణ సంప్రదాయం ప్రకారం రష్మికకు బొట్టు పెట్టి కానుక అందించగా, ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!