

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘రామాయణ’ ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమాను పంపించినట్లు తెలుస్తోంది. అకాడమీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన చిత్రాలు తమ దేశం తరఫున అధికారికంగా ఎంపిక కాకపోయినా, నిబంధనల ప్రకారం కొన్ని విభాగాల్లో స్వతంత్రంగా పోటీకి తమ పేర్లను సమర్పించుకోవచ్చు. అదే విధంగా ‘రామాయణ’ను కూడా పరిశీలనకు పంపించినట్లు సమాచారం.
ఇక అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైంది. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకున్న ‘అంఘ్’ కూడా ఈ విభాగంలో పరిశీలనకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. నవంబర్ 5న విడుదలైన ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారు రూ.663 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!