

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న విడుదలై రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడితో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఈ వేడుకల మధ్య చిత్ర యూనిట్ చేసిన ఓ మంచి పని అందరి ప్రశంసలను అందుకుంటోంది.
పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఉపయోగించిన ఒరిజినల్ క్రికెట్ బ్యాట్‌ను పోలి ఉండే ప్రత్యేక రెప్లికా బ్యాట్లను తయారు చేసి, వాటిపై రామ్ చరణ్ స్వయంగా సంతకాలు చేశారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా రూపకల్పన చేసిన ఈ బ్యాట్లను అనాథాశ్రమాల్లోని చిన్నారులకు బహుమతిగా అందజేశారు. రామ్ చరణ్ సంతకం చేసిన బ్యాట్లను అందుకున్న చిన్నారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ టీమ్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!