

రాజు వెడ్స్ రాంబాయి గ్రామీణ కథగా మంచి పేరు సంపాదించుకుంటున్న వేళ, చిత్రబృందం ఆంధ్ర–సీడెడ్ ప్రాంతాల్లో మహిళల కోసం ఫ్రీ స్క్రీనింగ్ ప్రకటించింది. “మా రాంబాయి కథ- ప్రతి మహిళ కోసం” అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ ఫ్రీ స్క్రీనింగ్ మహిళల్లో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ప్రధాన సెంటర్లలో ఈ ఫ్రీ స్క్రీనింగ్ అందుబాటులో ఉండడం విశేషం.
ఈ నేపథ్యంలో, చిత్రబృందం విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు వంటి పలు పట్టణాల్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న థియేటర్ల జాబితాను విడుదల చేసింది. థియేటర్ కౌంటర్ వద్ద ఫ్రీ టికెట్లు తీసుకోవాల్సిందిగా పోస్టర్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. భావోద్వేగాలతో నిండిన గ్రామీణ ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి “రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్”గా ఎదుగుతోంది. ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ స్క్రీనింగ్ వల్ల సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.











కామెంట్స్ (1)
too emotional