

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రాజమౌళి చేసిన తాజా వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటివరకు యాక్షన్ అడ్వెంచర్‌గా భావించిన ఈ సినిమా అసలు హృదయం తండ్రీ-కొడుకుల భావోద్వేగమేనని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లొకేషన్లలో సాగే ఈ కథలో ఫాంటసీ, రామాయణం అంశాలు కూడా ఉంటాయని చెప్పారు.
ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు వంటి విజువల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక గ్లోబల్ అడ్వెంచర్ జర్నీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు. మహేశ్ బాబు ద్విపాత్రాభినయంలో కనిపిస్తారన్న ప్రచారం సాగుతుండగా, ప్రకాశ్ రాజ్ ఆయన తండ్రి పాత్రలో ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!