
జనరల్

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా చాలా కాలం తర్వాత ‘వైబ్’ అనే చిత్రంతో మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన ఆమె, తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించింది. ‘పంచ్, పంచ్‌లైన్ రెండూ వైబ్‌తో గ్యారంటీ’ అంటూ ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుందని తెలిపింది.
ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు కునాల్ కెమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి జింటాతో పాటు కునాల్ కెమ్ము, స్పర్శ్ శ్రీవాస్తవ, వాన్సిక ధీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!