
జనరల్

పెళ్లి తర్వాత భర్తలు ఎదుర్కొనే సరదా పరిస్థితులను నవ్వులు పూయించేలా చూపిస్తూ ‘పురుష:’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో మంచి ఫీల్‌ను కలిగిస్తోంది. హీరోగా పవన్ కళ్యాణ్ బత్తుల ఆకట్టుకోగా, దర్శకుడు వీరు ఉలవల కథను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
ట్రైలర్లో వెన్నెల కిషోర్ చెప్పిన పంచ్ డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ తమ కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని మరింత పెంచారు. కుటుంబ భావోద్వేగాలను కూడా జోడించిన ఈ సినిమా మే 22న విడుదల కానుండగా, ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!