
సినిమాలు

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పనులను మేకర్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
సినిమాకు సంబంధించిన ప్రధాన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. ఇక యూఎస్ఏ ప్రింట్లు రేపు పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ ముంబై, భోపాల్ వంటి ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!