

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మా వందే తొలి షూటింగ్ షెడ్యూల్ను హైదరాబాద్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన బీహైండ్ ది సీన్స్ చిత్రాలను విడుదల చేస్తూ చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. సంప్రదాయ పూజతో ప్రారంభమైన హైదరాబాద్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తొలి దశ పూర్తవడంతో తదుపరి షెడ్యూల్ను కాశ్మీర్లో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నరేంద్ర మోదీ జీవిత ప్రయాణాన్ని విలువలు, సంకల్పం, ధైర్యంతో ఆవిష్కరించే ప్రయత్నమే మా వందే. వీర రెడ్డి ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రాంతి కుమార్ సీ.హెచ్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్షన్, కింగ్ సోలమన్ యాక్షన్, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి, సలార్, కేజీఎఫ్ వంటి భారీ చిత్రాల్లో పనిచేసిన సాంకేతిక నిపుణుల కలయిక ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!