
జనరల్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా కనిపించనుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమాచారం ప్రకారం, ఈ వారంలోనే ఇరుముడి చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ గ్లింప్స్‌ను పెద్ది సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త వెనుకబడిన రవితేజకు ఈ సినిమా కీలకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!