

తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా కలిసి హైదరాబాద్‌లో ‘ఐక్య ధైర్య సేన సమితి’ అనే సామాజిక సేవా సంస్థను అధికారికంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశంలో ఈ సంస్థను ఆవిష్కరించారు. “ఐక్యత, ధైర్యం, సేవ, ప్రభావం” అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు.
సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికగా ఈ సంస్థ పనిచేస్తుందని మనోజ్ తెలిపారు. ఈ ట్రస్ట్ తొలి కార్యక్రమంగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్య బాధ్యతలను చేపడుతున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా ఈ సంస్థ పని చేస్తుందని మౌనిక భూమా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ‘మిరాయి’ చిత్రంలో తన నటనతో ప్రశంసలు అందుకున్న మనోజ్ ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!