

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘గ్లోబ్‌ట్రాటర్’ తొలి లైవ్ టీజర్ ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. నవంబర్ 15, 2025న సాయంత్రం 7 గంటలకు, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ భారీ ఈవెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ప్రత్యేకంగా సిద్దం చేసిన గ్రాండ్ ఎంట్రీతో తెరతీర్చుకోనుంది. వెంటనే ఆయన పాత్రను పరిచయం చేస్తూ మసాయి మరా నేపథ్యంతో రూపొందించిన మూడు నిమిషాల టీజర్‌ను విడుదల చేయనున్నారు.
సంగీత కార్యక్రమం కూడా ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిత్రం టైటిల్ ట్రాక్‌ను శృతి హాసన్ మరియు డివైన్ ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. అభిమానులు ఇంటి నుంచే ఈ వేడుకను ఆస్వాదించేందుకు జియోహాట్‌స్టార్ ప్రత్యేక లైవ్ ప్రసారం అందిస్తోంది. ఈ ఈవెంట్ చివర్లో అద్భుతమైన ఫైర్వర్క్స్ షోతో వేడుక ముగియనుంది.








.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!