

టాలీవుడ్లో కృతి శెట్టి కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయం, చిలిపితనంతో “ఉప్పెన”తో ఎంట్రీ ఇచ్చిన కృతి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆమె కెరీర్ కొంచెం నెమ్మదించింది. తెలుగు సినిమా అవకాశాలు తగ్గడంతో కృతి ఇప్పుడు తమిళం, మలయాళం వైపు దృష్టి సారించింది. మాలీవుడ్‌లో మాత్రం ఆమెకు ఘనమైన ఆరంభం లభించింది. గత ఏడాది విడుదలైన ‘ఏఆర్ఎమ్’ సినిమాతో కృతి మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి, ఆమెకు కొత్త గుర్తింపు తెచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడ కొత్త ఆఫర్లు దక్కడంలో ఆమెకు అంతగా అదృష్టం కలగలేదు.
‘ఏఆర్ఎమ్’ తర్వాత కృతి ఇప్పటివరకు కొత్త సినిమా సైన్ చేయలేదు కానీ, కోలీవుడ్‌లో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. ‘కస్టడీ’తో తమిళంలో లాంచ్ అయినా, ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె హీరో ప్రదీప్ రంగనాథ్‌కు జోడీగా నటిస్తోంది. నయనతార స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తుండగా, దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్ సూపర్ ఫార్మ్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆయనతో కృతి జోడీ కట్టడం ఆమెకు అదృష్టంగా మారొచ్చని ఇండస్ట్రీలో చర్చ. ఈ సినిమా సక్సెస్ అయితే, కృతి శెట్టి మళ్లీ తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో బిజీ హీరోయిన్గా మారడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.
తన కెరీర్లో మరో పెద్ద మలుపు కావొచ్చని భావిస్తూ, ఈ సినిమా కోసం కృతి చాలా కష్టపడుతోందట. ఈ సక్సెస్‌తో టాలీవుడ్లో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకోవాలని కృతిశెట్టి ఆశిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!