

న్యూఢిల్లీ లోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్, హైదరాబాద్ కొరియా గౌరవ కాన్సులేట్ కలిసి మూడో కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను బంజారాహిల్స్ ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. అన్ని వయస్సుల వారికి ఉచిత ప్రవేశం కల్పించిన ఈ వేడుకలో కొరియన్ సినిమాలతో పాటు హాంబోక్ ట్రైయల్స్, కాలిగ్రఫీ, ఫేస్ పెయింటింగ్ వంటి సంస్కృతిక ఆకర్షణలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫెస్టివల్ హైలైట్ గా ప్రముఖ కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్ పాల్గొన్నారు.
యూ ఇన్-షిక్ అభిమానులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడుతూ, ఇది తన మొదటి ఇండియా ట్రిప్ అని, హైదరాబాద్ బిర్యానీ ఎంతో నచ్చిందని చెప్పారు. తమ డ్రామాల పై ఇక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి చూసి ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇండియన్, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు చేయాలని భావిస్తున్నానని తెలిపారు. కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ కూడా ఇండియా–కొరియా కల్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో మరింత కోలాబరేషన్స్ రావాలని ఆశించారు.
కొరియా గౌరవ కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ, రెండు దేశాల సంస్కృతుల్లో పోలికలు ఉన్నాయని, ఇండియాలో కొరియన్ డ్రామాలకు భారీ వ్యూవర్షిప్ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చేసినట్లే, కొరియన్ మేకర్స్ కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునేలా పూర్తిస్థాయి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొరియాలో షూటింగ్ ఖర్చులు పెరిగిన కారణంగా భవిష్యత్తులో ఇండియా–కొరియా కలిసి సినిమా, వెబ్ ప్రాజెక్టుల పై పని చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.















కామెంట్స్ (1)
హైదరాబాద్‌లో జరిగిన మూడో కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అద్భుతం!