

బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ మరియు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కలిసి నటిస్తున్న ‘కింగ్’ సినిమా చిత్రీకరణ జోరుగా కొనసాగుతోంది. తాజాగా దసరా పండగ నేపథ్యంలో రూపొందించిన కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. ‘పఠాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దసరా వేడుకలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో వందలాది నేపథ్య కళాకారుల మధ్య షారుక్ ఖాన్, సుహానా ఖాన్లతో కీలక యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో సుహానా ఖాన్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు, అందుకోసం ఆమె ప్రత్యేకంగా యాక్షన్ విన్యాసాల్లో శిక్షణ పొందినట్లు సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంట్లో దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సి, జాకీ ష్రాఫ్ తదితర ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!