

గత ఐదేళ్లలో దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసిన హీరోయిన్లలో కీర్తి సురేష్ పేరు ముందుంటుంది. ‘మహానటి’తో భారీ పేరు, బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆమె, ఆ తర్వాత వరుసగా పెంగ్విన్, మిస్ ఇండియా, సాని కాయిదం, గుడ్ లక్ సఖి, రఘు తాత వంటి మహిళా ప్రధాన చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేదు. కొన్నివి నేరుగా ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకోగా, మిగతావి థియేటర్లలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా వచ్చిన ‘రివాల్వర్ రీటా’ కూడా అదే బాటలో నడిచి విడుదల రోజునే ఫ్లాప్‌గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లోనూ నెగెటివ్ రివ్యూలే వచ్చాయి.
సినిమా కంటెంట్ బాగాలేకపోవడమే కాకుండా, విడుదలకు ముందే బజ్ లేకపోవడం, హైదరాబాద్ వంటి సిటీల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు లేకపోవడం కూడా గమనార్హం. చాలాచోట్ల టికెట్లు అమ్మకంలేక మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. బ్యాడ్ టాక్ వల్ల తర్వాతి షోల పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగింది. స్టార్ల పక్కన నటించినప్పుడు ‘దసరా’ లాంటి విజయాలు వచ్చినా, కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం వరుసగా విఫలమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్లపై వివక్ష ఉందని ఆమె చేసిన కామెంట్ కూడా వెనక్కి తిరిగింది. మంచి స్క్రిప్ట్‌లు, సరైన ప్రమోషన్ లేకుండా వచ్చే ఈ తరహా చిత్రాలకు కీర్తి కొంతకాలం విరామం ఇవ్వడం మంచిదనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!