

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కేడీ ది డెవిల్ చిత్రం ట్రైలర్ తొలగింపు ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది. యూట్యూబ్లో విడుదలైన ట్రైలర్ కొద్దిసేపటికే కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందిస్తూ, ట్రైలర్ పొరపాటున ధ్రువీకరించని వెర్షన్లో విడుదలైందని, అందుకే వెంటనే తొలగించామని వెల్లడించింది.
త్వరలో సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా కొత్త వెర్షన్ విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జ హీరోగా నటిస్తుండగా, శిల్పాశెట్టి, రవిచంద్రన్, రమేష్ అరవింద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా సంజయ్ దత్, నోరా ఫతేహి కనిపించనున్నారు. ఈ నెల 30 న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ట్రైలర్ వివాదం తర్వాత ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!