
జనరల్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిత్ర పరిశ్రమకు ఆదర్శంగా నిలిచారు. ‘కల్కి 2’ షూటింగ్కు వెళ్లేందుకు ఆయన వ్యక్తిగత చార్టర్ విమానాన్ని కాకుండా సాధారణ ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో ఫోటోతో పంచుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో సినిమా రంగం కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని కమల్ హాసన్ ఇటీవల తెలిపారు. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేయాలని, కానీ కార్మికుల వేతనాలు, భద్రత, ఆహారం, రవాణా, గౌరవం విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
భారత సినీ పరిశ్రమ మొత్తం ఖర్చులపై ఏకాభిప్రాయం అవసరమని ఆయన సూచించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కల్కి 2’లో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా, దర్శకత్వం నాగ్ అశ్విన్ వహిస్తున్నారు. షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!