
గాసిప్స్

నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల మధ్య ప్రేమ సంబంధం ఉందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఈ విషయంపై వారు అధికారికంగా అంగీకరించలేదు గానీ, ఖండించలేదు గానీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై ప్రశ్నించగా, సరైన సమయం వచ్చినప్పుడు తానే మాట్లాడతానని రష్మిక స్పష్టం చేశారు.
గత నాలుగేళ్లుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయని, నిజం ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుందని రష్మిక చెప్పడం గమనార్హం. దీంతో త్వరలోనే పెళ్లి వార్త ఉండొచ్చన్న ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ‘గీత గోవిందం’తో మొదలైన వీరి స్నేహం ‘డియర్ కామ్రేడ్’తో మరింత బలపడింది. పని విషయానికి వస్తే, రష్మిక ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటించగా, త్వరలో ‘కాక్‌టెయిల్ 2’ మరియు ‘మైసా’ చిత్రాల్లో కనిపించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!