
రాజకీయాలు

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి దీప్తి సునయన తన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ పోస్టును పంచుకున్నారు. గత పదేళ్లుగా తనను నిరంతరం ప్రోత్సహిస్తూ, ప్రతి పరిస్థితిలో అండగా నిలిచిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా తాను విశ్రాంతి తీసుకుంటూ గడిపానని, పెద్దగా ప్రాజెక్టులు చేయకపోయినా అభిమానులు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తనలో ఉత్సాహం ఎందుకు తగ్గిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని దీప్తి వెల్లడించారు. అయితే త్వరలోనే మళ్లీ పూర్తి ఉత్సాహంతో, కొత్త శక్తితో ప్రేక్షకుల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మి, ప్రేమించి, ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె పోస్ట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!